Friday, 14 August 2026

Tag: జగ్గంపేట మండలం మలిశాల

తూర్పు గోదావరి

పేదలకు పట్టాలు ఇప్పించండి

జగ్గంపేట మండలం, మల్లిసాల, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 14 *సోమవారం నాడు కాకినాడ కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయండి*. కర్నాకుల పిలుపు.మల్లిశాల, కే గోపాలపురం మధ్యలో ఉన్న ప్రభుత్వ పోరంబోకైన 580 ఎకరాల అడ్డుకొండ భూమిని రెండు గ్రామాల ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఓసి పేదలకు పంచిపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు కాకినాడ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిస్తూ శుక్రవారం నాడు కే.గోపాలపురంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఈ భూమిని నమ్ముకుని రెండు గ్రామాల ప్రజలు ఉన్నారని, కానీ రెవెన్యూ నిర్లక్ష్యం వల్ల ఈ భూమిపై పోరాటం సాగుతూనే ఉందని ఆయన తెలిపారు.ఈ భూమి కోసం అనేక కేసులు, దాడులు, నిర్బంధాలు ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు.అడ్డుకొండ భూమి రెండు గ్రామాల ప్రజలకు దక్కే వరకు పోరాటం ఆగదని అన్నారు. అలాగే సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన చలో కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శి బి. రమేష్, కే. రామలింగేశ్వర రావు, ఏఐఎఫ్టీయూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కుంచె అంజిబాబు,జాన్, కె.గోపాలపురం నాయకులు పోచమ్మ, అప్పారావు, వెంకటేష్, కృష్ణ, మల్లిసాల గ్రామ నాయకులు బోడకుర్తి అబ్బులు, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.