ఎమ్మెల్సీ కోదండరాంకు బస్తీ దవాఖాన సపోర్టింగ్ స్టాఫ్ జన్మదిన శుభాకాంక్షలు
పున్నమి: హైదరాబాద్, సెప్టెంబర్ 5: తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం జన్మదిన వేడుకలు తార్నాకలోని ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి కార్మిక విభాగం అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, తెలంగాణ బస్తీ దవాఖాన కాంట్రాక్ట్ & ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు మంగళిపాటి సుమన్, ప్రధాన కార్యదర్శి అంజద్ అలీ ఖాన్, కన్వీనర్, తెలంగాణ ఉద్యమకారుడు మెతుకు ఉప్పలయ్య, సంయుక్త కార్యదర్శి రౌతు నరసింహ, సభ్యులు గౌలికార్ మహేష్ కుమార్, వేముల అఖిల్ తదితరులు కోదండరాంను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కోదండరాంను శాలువాతో సత్కరించి, ఆయనకు ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత విజయాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బస్తీ దవాఖాన కాంట్రాక్ట్ & ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ప్రతినిధులు, తెలంగాణ జన సమితి కార్మిక విభాగం నాయకులు పాల్గొన్నారు.








