జెన్–జీతో కోటంరెడ్డి ముఖాముఖి
బుజబుజ నెల్లూరులోని రావూస్ కాలేజీలో నేడు నిర్వహించిన ‘కోటంరెడ్డి కనెక్ట్స్ విత్ జెన్–జీ’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. విద్య, ఉపాధి, రాజకీయాలు, యువత భవిష్యత్తు, సమాజంలో వారి పాత్రపై విద్యార్థులతో చర్చించారు. ప్రభుత్వం నుంచి యువత ఏం కోరుకుంటుందో తెలుసుకోవడానికే వచ్చానన్నారు. విద్యార్థుల ఆలోచనలు, మనోభావాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మంచి నాయకత్వాన్ని ఎంచుకోవడం యువత చేతుల్లోనే ఉందని ఆయన సూచించారు. కార్యక్రమం విద్యార్థుల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో ఆద్యంతం ఆసక్తికరంగా విజయవంతంగా సాగింది.


