తెలంగాణ భాష, యాస, గోసకు ప్రతిరూపం కాళోజీ.. బీసీ స్టడీ సర్కిల్‌లో ఘన నివాళి
రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 9 (పున్నమి ప్రతినిధి) తెలంగాణ భాష, యాస, ప్రజల గోసను తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని బీసీ స్టడీ సర్కిల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. “పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది” అంటూ కాళోజీ రాసిన నా గొడవ సమాజం గొడవగా నిలిచిందని వక్తలు పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న బాధలు, అన్యాయాలను తన రచనల ద్వారా నిర్భయంగా ప్రశ్నించిన మహనీయుడు కాళోజీ అని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, సిబ్బంది హరీష్, సురేష్, కిరణ్మయి, దివ్య, బాలకిషన్, మురళి, అనిత, విద్యార్థులు పాల్గొన్నారు.


