Monday, 17 August 2026

Tag: ఎల్బీనగర్‌లో ఘనంగా బోనాల పండుగ వేడుకలు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి

రంగారెడ్డి

ఎల్బీనగర్‌లో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

ఎల్బీనగర్‌లో ఘనంగా బోనాల పండుగ వేడుకలు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి ఎల్బీనగర్: బోనాల పండుగను పురస్కరించుకొని ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని భరత్‌నగర్, హయత్‌నగర్, బృందావన కాలనీ, వీరన్నగుట్ట కాలనీలలోని పలు దేవాలయాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను నిర్వహిస్తున్న భక్తులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మన్సురాబాద్ డివిజన్ అధ్యక్షుడు స్వామిగౌడ్, లెక్చరర్స్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కళ్లెం నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర మహేందర్, ఎల్బీనగర్ ఎస్సీ సెల్ చైర్మన్ ఇరిగి రమేశ్, నగేష్, చుక్క వెంకటేష్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.