జంపపాలెంలో రూ.35 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం..!!
పున్నమి – కే ఆనంద్ (అనకాపల్లి బ్యూరో ) : యలమంచిలి నియోజకవర్గం యలమంచిలి రూరల్ పరిధిలోని జంపపాలెం గ్రామంలో రూ.35 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక వసతుల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. జంపపాలెం గ్రామ అభివృద్ధికి అవసరమైన మరిన్ని పనులను కూడా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
