Tuesday, 29 September 2026
  • Home  
  • విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలి
- వరంగల్

విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలి

చెన్నారావుపేట, సెప్టెంబర్ 28( పున్నమి ): చెన్నారావుపేట, మండల విద్యాశాఖ అధికారిని పాపమ్మ. అభ్యసనా సామర్థ్యాలపై వివరించిన ఆర్ పి బాలాజీ రావు , నెక్కొండ మండలాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశం చెన్నారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల విద్యాశాఖ అధికారిని మానుపాటి పాపమ్మ అధ్యక్షత వహించగా రిసోర్స్ పర్సన్గా పిన్నింటి బాలాజీ రావు పాల్గొని ఉపాధ్యాయులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారిని పాపమ్మ మాట్లాడారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను గుర్తించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వారికి రెమిడియల్ టీచింగ్ ద్వారా అవసరమైన అదనపు అభ్యసన అవకాశాలను కల్పించాలని సూచించారు. ప్రతి విద్యార్థి స్థాయిని గుర్తించి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా బోధన చేపట్టడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశీలనా శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించే విధంగా వినూత్న కృత్యాలు, ప్రయోగాలు, బోధన, అభ్యసన సామగ్రి తయారు చేసి తరగతి గదిలో వినియోగించాలన్నారు. విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల సమన్వయం, నిరంతర పర్యవేక్షణ, వినూత్న బోధనా విధానాలు కీలకమని సమావేశంలో పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిని మెరుగుపరిచే దిశగా ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. సిలబస్ పునశ్చరణ, ముఖ్యమైన అంశాలపై సాధన, ప్రశ్నలను విశ్లేషించే సామర్థ్యం, రాత నైపుణ్యం, సమయపాలన వంటి అంశాలపై విద్యార్థులకు నిరంతర మార్గదర్శకత్వం అందించాలన్నారు. రిసోర్స్ పర్సన్ పిన్నింటి బాలాజీ రావు అభ్యసనాభివృద్ధి కార్యక్రమం, న్యాస్ ఫలితాలు, విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపుదల, బోధన, అభ్యసన ప్రక్రియలో విద్యార్థుల స్థాయికి అనుసరించాల్సిన విధానాలపై వివరించారు. విద్యార్థుల ప్రగతిని నిరంతరం అంచనా వేయడానికి ఫార్మేటివ్ అసెస్మెంట్ టెస్టులు, సమ్మేటివ్ అసెస్మెంట్ టెస్టుల ప్రాధాన్యతను వివరించారు. ఫిజికల్ సైన్స్ బోధనలో వినూత్న బోధనా పద్ధతులు, ప్రయోగాత్మక బోధన, విద్యార్థి కేంద్రిత అభ్యసనం వంటి విధానాలను విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు. లింగాపురం ఫిజికల్ సైన్స్ అనుగుణంగా ఉపాధ్యాయుడు రమణయ్య పదవ తరగతిలో పలు పాఠ్యాంశాలపై వర్క్ షీట్లను సాధన చేయించారు. ప్రస్తుతం సమీపిస్తున్న ఎస్ ఎ-1 పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంపై ప్రత్యేకంగా చర్చించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన పిన్నింటి బాలాజీరావును రెండు మండలాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారిని పాపమ్మ చెన్నారావుపేట హైస్కూల్ ఉపాధ్యాయులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో చెన్నారావుపేట, నెక్కొండ మండలాలకు చెందిన ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ అసిస్టెంట్ సెక్రటరీ నర్సయ్య, సిఆర్పి సంపత్, పాల్గొన్నారు.

చెన్నారావుపేట, సెప్టెంబర్ 28( పున్నమి ): చెన్నారావుపేట,
మండల విద్యాశాఖ అధికారిని పాపమ్మ. అభ్యసనా సామర్థ్యాలపై వివరించిన ఆర్ పి బాలాజీ రావు
, నెక్కొండ మండలాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశం చెన్నారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల విద్యాశాఖ అధికారిని మానుపాటి పాపమ్మ అధ్యక్షత వహించగా రిసోర్స్ పర్సన్గా పిన్నింటి బాలాజీ రావు పాల్గొని ఉపాధ్యాయులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారిని పాపమ్మ మాట్లాడారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను గుర్తించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వారికి రెమిడియల్ టీచింగ్ ద్వారా అవసరమైన అదనపు అభ్యసన అవకాశాలను కల్పించాలని సూచించారు. ప్రతి విద్యార్థి స్థాయిని గుర్తించి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా బోధన చేపట్టడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశీలనా శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించే విధంగా వినూత్న కృత్యాలు, ప్రయోగాలు, బోధన, అభ్యసన సామగ్రి తయారు చేసి తరగతి గదిలో వినియోగించాలన్నారు. విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల సమన్వయం, నిరంతర
పర్యవేక్షణ, వినూత్న బోధనా విధానాలు కీలకమని సమావేశంలో పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిని మెరుగుపరిచే దిశగా ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. సిలబస్ పునశ్చరణ, ముఖ్యమైన అంశాలపై సాధన, ప్రశ్నలను విశ్లేషించే సామర్థ్యం, రాత నైపుణ్యం, సమయపాలన వంటి అంశాలపై విద్యార్థులకు నిరంతర మార్గదర్శకత్వం అందించాలన్నారు. రిసోర్స్ పర్సన్ పిన్నింటి బాలాజీ రావు అభ్యసనాభివృద్ధి కార్యక్రమం, న్యాస్ ఫలితాలు, విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపుదల, బోధన, అభ్యసన ప్రక్రియలో విద్యార్థుల స్థాయికి అనుసరించాల్సిన విధానాలపై వివరించారు. విద్యార్థుల ప్రగతిని నిరంతరం అంచనా వేయడానికి ఫార్మేటివ్ అసెస్మెంట్ టెస్టులు, సమ్మేటివ్ అసెస్మెంట్ టెస్టుల ప్రాధాన్యతను వివరించారు. ఫిజికల్ సైన్స్ బోధనలో వినూత్న బోధనా పద్ధతులు, ప్రయోగాత్మక బోధన, విద్యార్థి కేంద్రిత అభ్యసనం వంటి విధానాలను విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు. లింగాపురం ఫిజికల్ సైన్స్ అనుగుణంగా ఉపాధ్యాయుడు రమణయ్య పదవ తరగతిలో పలు పాఠ్యాంశాలపై వర్క్ షీట్లను సాధన చేయించారు. ప్రస్తుతం సమీపిస్తున్న ఎస్ ఎ-1 పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంపై ప్రత్యేకంగా చర్చించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన పిన్నింటి బాలాజీరావును రెండు మండలాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారిని పాపమ్మ చెన్నారావుపేట హైస్కూల్ ఉపాధ్యాయులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో చెన్నారావుపేట, నెక్కొండ మండలాలకు చెందిన ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ అసిస్టెంట్ సెక్రటరీ నర్సయ్య, సిఆర్పి సంపత్, పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.