*రామాపురంలో బహిరంగ సభకు మహిమలూరు పంచాయతీ నుంచి కార్యకర్తల తరలింపు**
**నెల్లూరు జిల్లా:** ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో నిర్వహించనున్న ‘పల్లె పండుగ 3.0’ బహిరంగ సభకు మహిమలూరు పంచాయతీ నుంచి టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుకానున్న నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు **మద్దినేని నారాయణ, కొప్పోలు రమణమ్మ, మోడగల రామారావు, బీఎల్ఏ శీను, బాలకొండయ్య, బీఎల్ఏ ధర్మయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు విజయ్** తదితరులు కార్యకర్తలతో సమన్వయం చేస్తున్నారు. మహిమలూరు పంచాయతీ నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేపట్టారు.
Uploaded Video:


