Monday, 28 September 2026
  • Home  
  • విద్యార్థి దశ ఎంతో కీలకం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
- ఎన్ టి ఆర్ జిల్లా

విద్యార్థి దశ ఎంతో కీలకం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ ప్రతినిధి విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి చదివే తత్వంతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విద్యార్థులకు సూచించారు. నందిగామ పట్టణం మధిర ఆర్చి రోడ్డులోని తేజ డీవీఆర్ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీలో కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో నూతనంగా అడుగుపెట్టిన విద్యార్థులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులే దేశ భవిష్యత్తు, యువత అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుని, భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు తమకు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు క్రమశిక్షణతో కృషి చేయాలని, కళాశాల విద్యను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా నూతన విషయాలను నేర్చుకునే అవకాశంగా మలచుకోవాలని సూచించారు. ఫ్రెషర్స్ పార్టీ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, వివిధ వినోద కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

నందిగామ ప్రతినిధి

విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి చదివే తత్వంతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విద్యార్థులకు సూచించారు.
నందిగామ పట్టణం మధిర ఆర్చి రోడ్డులోని తేజ డీవీఆర్ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీలో కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో నూతనంగా అడుగుపెట్టిన విద్యార్థులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థులే దేశ భవిష్యత్తు, యువత అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుని, భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.
విద్యార్థులు తమకు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు క్రమశిక్షణతో కృషి చేయాలని, కళాశాల విద్యను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా నూతన విషయాలను నేర్చుకునే అవకాశంగా మలచుకోవాలని సూచించారు.
ఫ్రెషర్స్ పార్టీ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, వివిధ వినోద కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారిని ఉత్సాహపరిచారు.
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.