*SSC CGLకు దరఖాస్తు చేశారా? రూ.1.50 లక్షల వరకు జీతం.. లాస్ట్ డేట్ ఇదే!*
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే CGL-2026 నియామకాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 12,256 గ్రూప్-B, గ్రూప్-C పోస్టులకు జూన్ 22 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు-సెప్టెంబర్లో టైర్-1, డిసెంబర్లో టైర్-2 పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. AI కారణంగా ఉద్యోగ భద్రతపై ఆందోళనల నేపథ్యంలో పలువురు ఐటీ ఉద్యోగులు కూడా SSC CGLపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.1,51,100 వరకు వేతనం ఉంటుంది. ఈ పోస్టులకు అధిక పోటీ నెలకొంది.
*దరఖాస్తు చేసుకునేందుకు లింక్:* https://ssc.gov.in/


