రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ గడువును పొడిగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివేక్ యాదవ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 88 శాతం SIR ప్రక్రియ పూర్తైందన్నారు. మొత్తం 4.16 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ కాగా, 3.69 కోట్ల మంది ఓటర్ల వివరాలు డిజిటలైజ్ అయ్యాయి. 14.19 లక్షల మంది మరణించినట్లు, 12.14 లక్షల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినట్లు గుర్తించారు.

SIR గడువు పొడిగింపునకు ఈసీకి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి లేఖ