Friday, 26 June 2026
  • Home  
  • SIR కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ
- ఖమ్మం

SIR కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ

ఖమ్మం జూన్ (పున్నమి జిల్లా రిపోర్టర్) ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ పిలుపునిచ్చారు. ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించి, అవసరమైన సవరణలు, కొత్త నమోదు, మార్పులు, తొలగింపుల కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి పౌరుడు ఈ ప్రక్రియలో భాగస్వామి కావాలని, SIR కార్యక్రమం విజయవంతానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ధనియాకుల వెంకట్ నారాయణ పేర్కొన్నారు.

ఖమ్మం జూన్
(పున్నమి జిల్లా రిపోర్టర్)

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ పిలుపునిచ్చారు. ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించి, అవసరమైన సవరణలు, కొత్త నమోదు, మార్పులు, తొలగింపుల కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి పౌరుడు ఈ ప్రక్రియలో భాగస్వామి కావాలని, SIR కార్యక్రమం విజయవంతానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ధనియాకుల వెంకట్ నారాయణ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.