నంద్యాల: నంద్యాల R&B గెస్ట్ హౌస్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఎన్డీఏ కూటమి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ.. కూటమి విజయం కోసం కష్టపడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు తగిన గుర్తింపు లభించేలా చూస్తామని స్పష్టం చేశారు. చిన్నచిన్న సమస్యలు ఉంటే పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణ స్వీకారంపై కూడా చర్చించామని, ఇచ్చిన హామీల మేరకు సంబంధిత కుటుంబానికి న్యాయం చేస్తూ త్వరలోనే ప్రమాణ స్వీకారం జరిగేలా చూస్తామని తెలిపారు. వైకాపా పాలన నాటి ఇబ్బందులు పునరావృతం కాకుండా ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని, కూటమి నాయకులమంతా ఐక్యంగా పనిచేస్తామని భరోసా ఇచ్చారు.

ఎన్డీఏ కూటమి ఐక్యతే మా లక్ష్యం: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ