వార్త ముఖ్యాంశాలు
- *సీనియర్ టిడిపి నాయకునికి దక్కని నివాళి* *కనీసం పలకరింపు లేని మండల, జిల్లా టిడిపి నాయకులు* డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం వాడ్రేవుపల్లి గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి నాయకుడు ప్రత్తిపాటి మాణిక్యం (83) ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడి…
- ఆయన గత 40 సంవత్సరాలుగా టిడిపి పార్టీకి సేవలు అందించిన సీనియర్ నాయకులు.
- ఇటీవల నీటి సంఘం డైరెక్టర్ గా ప్రస్తుత ప్రభుత్వం నామినేటెడ్ పదవి ఆయనకు ఇచ్చి గౌరవించింది.
*సీనియర్ టిడిపి నాయకునికి దక్కని నివాళి*
*కనీసం పలకరింపు లేని మండల, జిల్లా టిడిపి నాయకులు*
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం
వాడ్రేవుపల్లి గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి నాయకుడు ప్రత్తిపాటి మాణిక్యం (83) ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో వైద్యం చేయించినా దురదృష్టవసాత్తు అకాల మృతి చెందారు. ఆయన గత 40 సంవత్సరాలుగా టిడిపి పార్టీకి సేవలు అందించిన సీనియర్ నాయకులు. ఇటీవల నీటి సంఘం డైరెక్టర్ గా ప్రస్తుత ప్రభుత్వం నామినేటెడ్ పదవి ఆయనకు ఇచ్చి గౌరవించింది. అయితే అకాల మరణం చెందిన మాణిక్యాన్ని కనీసం చివరి చూపులకు గాని, ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి గాని, కుటుంబానికి ధైర్యం చెప్పడానికి గాని సీనియర్ టిడిపి నాయకులు ఎవరు రాకపోవడం శోచనీయం. ఇదిలా ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల తన తండ్రి చనిపోయారని తమకు న్యాయం జరగాలని ఆయన కుమార్తె ముత్యాల అనూరాధ పలువురు దగ్గర వాపోతున్నారు. సీనియర్ తెలుగుదేశం నాయకులు తోటి తెలుగుదేశం నాయకుడు చనిపోతే వారి కుటుంబాన్ని పరామర్శించకపోవడం ఎంతవరకు సబబని, ఆయన కుటుంభానికి న్యాయం జరగాలని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.