పరస్పర సౌభ్రాతృత్వంతో బక్రీద్ పండుగను జరుపుకోవాలని నాగర్ కర్నూలు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ సూచించారు. ప్రభుత్వ, మున్సిపల్ నిబంధనల మేరకే ఖుర్బానీ ప్రక్రియ జరగాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని, వాట్సాప్, ఫేస్ బుక్ లలో ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మీడియా సమావేశంలో సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు


