నాగర్కర్నూల్ : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హెచ్చరికతో పీఏసీఎస్, మార్క్ఫెడ్ అధికారులు దిగివచ్చారు. రైతుల ట్రాక్టర్లలో ఉన్న మొక్కజొన్న బస్తాలను అన్లోడ్ చేయకపోతే లారీలను బంద్ చేయిస్తానని, గోదాం వద్దే బైఠాయిస్తానని ఆయన అల్టిమేటం జారీ చేశారు. దీనితో దిగివచ్చిన అధికారులు వెంటనే స్పందించారు. గోదాం వెలుపల వేచి ఉన్న రైతుల ట్రాక్టర్లలోని మొత్తం మొక్కజొన్న ధాన్యం బస్తాలను తక్షణమే అన్లోడింగ్ చేయించారు. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
Uploaded Video:

