కడప జిల్లాలో 60 మద్యం దుకాణాలకు కొత్త లైసెన్సులు
పున్నమి ప్రతినిధి
సెప్టెంబర్ 25, కడప
కడప జిల్లాలో 2026-27 ఎక్సైజ్ పాలసీలో భాగంగా 60 మద్యం దుకాణాలకు కొత్త లైసెన్సులు మంజూరు చేయనున్నారు. ఇందుకోసం డ్రా ద్వారా మద్యం దుకాణాల ఎంపికకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు.
ఒక్కో మద్యం దుకాణానికి దరఖాస్తు రుసుము రూ.3 లక్షలుగా, ప్రాసెసింగ్ ఫీజు రూ.1,000గా నిర్ణయించారు. ఒక అభ్యర్థి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దుకాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
దరఖాస్తుల సమర్పణకు అక్టోబర్ 1 రాత్రి 12 గంటల వరకు గడువు విధించారు. అక్టోబర్ 5 ఉదయం 8 గంటలకు కొత్త కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా ప్రక్రియ నిర్వహించనున్నారు. డ్రాలో ఎంపికైన అభ్యర్థులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు లైసెన్సు పొందాల్సి ఉంటుంది.



