డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంకాలజీ (క్యాన్సర్) విభాగాన్ని అమలాపురం ఎంపీ జి.ఎం. హరీష్ బాలయోగి పరిశీలించారు. ఆసుపత్రి అధినేత చైతన్య రాజుతో కలిసి ఆయన విభాగంలోని వైద్య సదుపాయాలు, అందుబాటులో ఉన్న అధునాతన పరికరాలను పరిశీలించారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అవసరమైన వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆసుపత్రి యాజమాన్యం, వైద్య సిబ్బంది తెలిపారు. రోగులకు నాణ్యమైన వైద్యం, తగిన చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు.



