*కుప్పం కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే అమర్*
పలమనేరు, సెప్టెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి ) :
వైకాపా ప్రభుత్వ హయాంలో బనాయించిన కేసుకు సంబంధించి కుప్పం అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మరియు కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం హాజరయ్యారు. గత ప్రభుత్వంలో 2021 ఏడాది శాంతిపురం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రైతుల శ్రేయస్సు కొరకు నిర్వహించిన ర్యాలీకి సంబంధించి రాళ్ళ బుదుగూరు పోలీస్ స్టేషన్ లో 28 మందిపై కేసు నమోదైంది.
జాతీయ రహదారిని దిగ్బంధించారని ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించి రోడ్డుపై వాహనములను ఆపి ప్రజా రవాణాకు ప్రజాశాంతికి భంగము కలిగించడమే గాక కరోనా నిబంధనలను ఉల్లంఘించారని కేసు పెట్టడమైంది. ఈ కేసులో ఏ-1 గా ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఉండగా, సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పీ. మనోహర్, ప్రస్తుత ఆర్టీసీ రిజినల్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులుతో సహా 25 మంది మేజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. వచ్చే నెల 5 వ తేదికి కేసు వాయిదా వేస్తున్నట్లు జడ్జి పేర్కొన్నారు.


