శ్రీ కాళహస్తి, జులై 02 : (పున్నమి న్యూస్) : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నివాసానికి విచ్చేశారు. గురువారం నాడు జరిగిన ఈ భేటీ బొజ్జల కుటుంబంలో తీవ్ర భావోద్వేగాలను, సంతోషాన్ని నింపింది. బొజ్జల నివాసానికి చేరుకున్న నారా లోకేష్‌కు కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులందరితో ఎంతో ఆత్మీయంగా ముచ్చటించి, వారితో కలిసి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దివంగత సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మధ్య ఉన్న దశాబ్దాల నాటి రాజకీయ అనుబంధాన్ని, వారి పవిత్ర స్నేహాన్ని బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి, కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. నాటి స్మృతులను నెమరువేసుకోవడం అక్కడ ఉన్న వారందరినీ తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. మంత్రి నారా లోకేష్‌తో పాటు ఈ ఆత్మీయ విందులో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు శాసనసభ సభ్యులు, కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. తమ కుటుంబంపై నారా లోకేష్ చూపిస్తున్న అపారమైన ప్రేమ, ఆత్మీయత ఎప్పటికీ మరువలేనివని, విందుకు విచ్చేసిన తోటి ఎమ్మెల్యేలకు, పార్టీ ముఖ్య నాయకులకు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో మంత్రి నారా లోకేష్ విందు