Saturday, 19 September 2026
  • Home  
  • తురకపల్లిలో లడ్డు వేలం.. రూ.21,001కు దక్కించుకున్న కన్నేమరకల పెంచలయ్య
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తురకపల్లిలో లడ్డు వేలం.. రూ.21,001కు దక్కించుకున్న కన్నేమరకల పెంచలయ్య

దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక స్వామి లడ్డు వేలం పాట ఉత్సాహంగా సాగింది. వేలం పాటలో నూతలపాటి పెంచలయ్య రూ.21,001కు లడ్డును దక్కించుకున్నారు. అలాగే చేరుకులు నూతలపాటి బుల్లోడు రూ.3,000, దేవుడు దండను నూతలపాటి అశోక్ రూ.2,800కు దక్కించుకున్నారు. అనంతరం భక్తులు, గ్రామస్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. నిమజ్జన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. నిర్వాహకులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.