టంగుటూరు: టంగుటూరు మండలంలోని టంగుటూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం (11-08-2026) ‘జ్ఞాన జ్యోతి’ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 0–6 సంవత్సరాల పిల్లలకు సంబంధించిన ‘నవచేతన’ అంశంపై శిక్షణ అందించారు. పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా అభ్యసన ప్రక్రియను ఎలా నిర్వహించాలి, చిన్నారుల్లో అభ్యసన సామర్థ్యాలను ఎలా పెంపొందించాలి అనే అంశాలను వివరించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో పాటు ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు సుచరిత ,జ్యోతి, సత్యవతి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్నారుల ప్రాథమిక అభ్యసనకు అవసరమైన అంశాలపై అవగాహన కల్పించారు.

టంగుటూరులో జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం
టంగుటూరు: టంగుటూరు మండలంలోని టంగుటూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం (11-08-2026) ‘జ్ఞాన జ్యోతి’ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 0–6 సంవత్సరాల పిల్లలకు సంబంధించిన ‘నవచేతన’ అంశంపై శిక్షణ అందించారు. పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా అభ్యసన ప్రక్రియను ఎలా నిర్వహించాలి, చిన్నారుల్లో అభ్యసన సామర్థ్యాలను ఎలా పెంపొందించాలి అనే అంశాలను వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో పాటు ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు సుచరిత ,జ్యోతి, సత్యవతి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్నారుల ప్రాథమిక అభ్యసనకు అవసరమైన అంశాలపై అవగాహన కల్పించారు.

