Wednesday, 23 September 2026
  • Home  
  • పింఛన్‌కు కుల ధ్రువీకరణ అవసరమా? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన గన్నవరపు శ్రీనివాసరావు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పింఛన్‌కు కుల ధ్రువీకరణ అవసరమా? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన గన్నవరపు శ్రీనివాసరావు

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం : వృద్ధాప్య పింఛన్లకు కుల ధ్రువీకరణ పత్రాలు ఎందుకు అవసరమని పి.గన్నవరం నియోజకవర్గ YSRCP ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. BCలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామంటే వయస్సుతో పాటు కుల నిర్ధారణ అవసరం కావచ్చని, అయితే SC, ST, OC వృద్ధులకు ఆధార్‌లోని వయస్సు ఆధారంగా పింఛన్ ఇవ్వవచ్చని అన్నారు. వృద్ధులకు పింఛన్ ఇవ్వడంలో కులాల వారీగా విభజన ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 28 జిల్లాలు, 688 మండలాలు, 16,862 గ్రామాల్లో సగటున గ్రామానికి 100 దరఖాస్తులు వస్తే సుమారు 16,86,200 మంది అవుతారని, వీరందరికీ పింఛన్లు అమలు చేస్తారా అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పింఛన్ల పేరుతో రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం జరుగుతోందా అని పి.గన్నవరం నియోజకవర్గ YSRCP ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నల వర్షం కురిపించారు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం :
వృద్ధాప్య పింఛన్లకు కుల ధ్రువీకరణ పత్రాలు ఎందుకు అవసరమని పి.గన్నవరం నియోజకవర్గ YSRCP ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. BCలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామంటే వయస్సుతో పాటు కుల నిర్ధారణ అవసరం కావచ్చని, అయితే SC, ST, OC వృద్ధులకు ఆధార్‌లోని వయస్సు ఆధారంగా పింఛన్ ఇవ్వవచ్చని అన్నారు. వృద్ధులకు పింఛన్ ఇవ్వడంలో కులాల వారీగా విభజన ఎందుకని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని 28 జిల్లాలు, 688 మండలాలు, 16,862 గ్రామాల్లో సగటున గ్రామానికి 100 దరఖాస్తులు వస్తే సుమారు 16,86,200 మంది అవుతారని, వీరందరికీ పింఛన్లు అమలు చేస్తారా అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పింఛన్ల పేరుతో రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం జరుగుతోందా అని పి.గన్నవరం నియోజకవర్గ YSRCP ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నల వర్షం కురిపించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.