ఖానాపురం పున్నమి ప్రతినిధి:
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గా అన్హరత వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు తెలియజేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ విజయం సాధించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ వైపు వెళ్లారంటూ రాజకీయ వివాదం మొదలైంది. 2024 లోక్ సభఎన్నికల్లో ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పూర్తి చేయడంతో అనారత అంశం మరింత కీలకంగా మారింది. దానంపై అన్హరత వేటు వేయాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ,మరియు బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వేరువేరుగా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ను స్పీకర్ తిరస్కరించడంతో ఆనిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టు ను ఆశ్రయించారు.



