సత్యం, అహింస, స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ ఆచరించాలి: ప్రగడ నాగేశ్వరరావు
పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో)
అచ్యుతాపురం: మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, త్యాగం మార్గాలు నేటి సమాజానికి దిశానిర్దేశం చేస్తాయని ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం అచ్యుతాపురం మండలం అచ్యుతాపురం గ్రామంలోని మోసయ్యపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజలను ఏకం చేసి అహింసా మార్గంలో స్వరాజ్య సాధనకు గాంధీజీ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. గ్రామీణాభివృద్ధి, స్వచ్ఛత, కుటీర పరిశ్రమల ప్రోత్సాహం వంటి గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సమరసత నెలకొనేలా బాపూజీ సిద్ధాంతాలను నిత్యజీవితంలో ఆచరించాలని కోరారు.
కార్యక్రమంలో వడిసెల శ్రీను, వైస్ ప్రెసిడెంట్ పుర్రె శ్రీనివాసరావు, ధర్మిరెడ్డి నాయుడు బాబు, SEZ ఎక్స్‌ఈఎన్ పీటీసీ నీరుకొండ నర్సింగరావు, చొప్ప తాతారావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.