Sunday, 27 September 2026
  • Home  
  • రూ.1.93 కోట్లతో కేశనపల్లి పీహెచ్‌సీ నిర్మాణానికి శంకుస్థాపన
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రూ.1.93 కోట్లతో కేశనపల్లి పీహెచ్‌సీ నిర్మాణానికి శంకుస్థాపన

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : మలికిపురం మండలం కేశనపల్లి గ్రామంలో రూ.1.93 కోట్ల నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవన నిర్మాణానికి రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ గారు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ ఆరోగ్య కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. పీహెచ్‌సీ నిర్మాణానికి ఒక ఎకరం స్థలంతో పాటు అప్రోచ్ రోడ్డుకు అవసరమైన స్థలాన్ని అందించిన దాతలను ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల ఆరోగ్య అవసరాల కోసం స్థలాన్ని అందించడం అభినందనీయమన్నారు. అనంతరం కేశనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భరతమాత విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :
మలికిపురం మండలం కేశనపల్లి గ్రామంలో రూ.1.93 కోట్ల నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవన నిర్మాణానికి రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ గారు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ ఆరోగ్య కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. పీహెచ్‌సీ నిర్మాణానికి ఒక ఎకరం స్థలంతో పాటు అప్రోచ్ రోడ్డుకు అవసరమైన స్థలాన్ని అందించిన దాతలను ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల ఆరోగ్య అవసరాల కోసం స్థలాన్ని అందించడం అభినందనీయమన్నారు. అనంతరం కేశనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భరతమాత విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.