మాధవధార, సెప్టెంబర్ 21: జీవీఎంసీ 54వ వార్డు ఊర్వసి జంక్షన్ ప్రధాన రహదారి సమీపంలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న 54వ వార్డు టీడీపీ అధ్యక్షుడు కార్తీక్ కుట్టా వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
సకాలంలో స్పందించి ఫైర్ సిబ్బందిని అప్రమత్తం చేసిన కార్తీక్ కుట్టాను స్థానికులు అభినందించారు. కార్యక్రమంలో పెంటకోట అజయ్‌తో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు.
Uploaded Video:


