: భారత ఎన్నికల సంఘం (ECI) అభివృద్ధి చేసిన ECINET ద్వారా 2002 ప్రత్యేక ఓటరు జాబితా (Special Intensive Revision – SIR) వివరాలను పరిశీలించే అవకాశం కల్పించింది. పాత ఓటరు జాబితాలో తమ పేరు లేదా కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయో లేదో ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. అవసరమైన చోట ఈ వివరాలను ఓటరు నమోదు ప్రక్రియలో వినియోగించుకోవచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు. పౌరులు అధికారిక ECI పోర్టల్ లేదా ECINET యాప్ ద్వారా ఈ సేవను వినియోగించుకోవాలని సూచించారు.
Reporter: Donkena Babu
Punnami News




