Tuesday, 14 July 2026
  • Home  
  • చికెన్ వ్యాపారుల సిండికేట్ దందా-ఆకాశాన్నంటుతున్న ధరలు
- తిరుపతి

చికెన్ వ్యాపారుల సిండికేట్ దందా-ఆకాశాన్నంటుతున్న ధరలు

శ్రీ కాళహస్తి, జులై 05 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలో చికెన్ షాపుల యజమానులు ఇష్టానుసారంగా సిండికేట్‌గా ఏర్పడి ధరలను భారీగా పెంచేస్తుండటంపై పట్టణవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ రేటుకు, స్థానిక దుకాణాల్లో అమ్మే రేటుకు అస్సలు పొంతన లేకుండా పోయిందని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఇటీవల కాలంలో పట్టణంలోని ప్రధాన చికెన్ మార్కెట్లతో పాటు కాలనీల్లోని దుకాణాలన్నీ ఒకే మాటపై నిలిచి, కిలో చికెన్ ధరను ఏకపక్షంగా పెంచుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక షాపులో రేటు ఎక్కువగా ఉందని పక్క షాపుకు వెళితే అక్కడా అదే ధర ఉంటుండటంతో వ్యాపారులంతా కలిసి మాట్లాడుకుని ఈ దందా సాగిస్తున్నారని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల గురించి ప్రశ్నిస్తే “తీసుకుంటే తీసుకో, లేకపోతే వెళ్ళు” అంటూ వ్యాపారులు దురుసుగా సమాధానం ఇస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఫారం కోళ్ల హోల్‌సేల్ ధరలకు, రిటైల్ అమ్మకం ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని, స్కిన్ లెస్, బోన్ లెస్ పేరుతో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. కేవలం ధరల్లోనే కాకుండా తూకంలోనూ భారీగా మోసం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చికెన్ సిండికేట్ దందాపై లీగల్ మెట్రాలజీ, పౌరసరఫరాల అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి షాపు వద్ద ప్రభుత్వ నిర్ణీత ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని, డిజిటల్ తూనిక యంత్రాలను తనిఖీ చేయాలని కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలు వసూలు చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుని, జరిమానాలు విధించాలని సంబంధిత అధికారులు, పౌరసరఫరాల శాఖ తక్షణమే స్పందించి తనిఖీలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.