Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Blog

Featured ఆంధ్రప్రదేశ్

మనం మన పరిసరాల శుభ్రత పై అవగాహన ర్యాలీ

బుచ్చిరెడ్డిపాలెం ఫిబ్రవరి 5 ( పున్నమి విలేఖరి ) బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని సచివాలయం – 4 మరియు వవ్వేరు సచివాలయం – 2 ఏరియాలలో నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు స్వచ్ఛభారత్, మనం మన పరిసరాల శుభ్రత పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మన పరిసరాల్లో చెత్త వేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలని, నగర పంచాయతీ వాహనాల్లోనే చెత్తను వేయాలని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వేయాలని సూచించారు. బహిరంగ మల మూత్ర విసర్జన చేయకుండా ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా చెత్త వేసిన యెడల జరిమానా విధించబడును హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 2 సచివాలయాల కార్యదర్శులు, సిబ్బంది, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, విఏవో లు పొదుపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు

Featured తెలంగాణ

ల కూచిపూడి నృత్య గురువు, నర్తకీమణి శ్రీమతి కొత్తపల్లి పద్మ గారు కనుమూశారు

సీనియర్ కూచిపూడి నృత్య గురువు, నర్తకీమణి శ్రీమతి కొత్తపల్లి పద్మ గారు హైదరాబాద్ లో కనుమూశారు కొంతకాలంగా ఆమె పక్షవాతానికి గురై అనారోగ్యం తో చికిత్స పొందుతున్నారు! డాక్టర్ వెంపటి చినసత్యం గారి దగ్గర 18 ఏళ్ల పాటు శిష్యరికం చేశారు! తెనాలికి చెందిన పద్మ గారు హైదరాబాద్ లో స్థిరపడి శ్రీనృత్యాలయ నాట్య సంస్థను ప్రారంభించి ఎందరో శిష్య ప్రశిష్యులను తీర్చి దిద్దారు ! తన ఐదవ ఏటనే నృత్యం పై మక్కువ పెంచుకున్నారు! టెన్త్ పూర్తీ కాగానే, విజయవాడ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నాట్యం లో డిప్లొమా పూర్తీ చేశారు! 1962 లో మద్రాస్ వెళ్లి పద్మభూషణ్ వెంపటి చిన సత్యం గారు నిర్వహించే కూచిపూడి ఆర్ట్ అకాడమీ లో శిష్యురాలిగా చేరారు! మద్రాస్ లో జరిగిన ఆమె కూచిపూడి నాట్య అరంగేట్రానికి నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి విచ్చేసిన విషయాన్నీ ఆమె ఎప్పుడూ గుర్తు చేస్తుండే వారు! శృంగారమణి, నాట్య మయూరి లాంటి బిరుదులూ పొందారు! ఆ రోజుల్లోనే కేంద్రం నుంచి స్కాలర్షిప్, ప్రశంసలు అందుకున్న గొప్ప నర్తకి గా గుర్తింపు పొందారు. ఐదు రోజుల క్రితమే ఆమె కుమారుడు కిరణ్ గుండెపోటు తో చనిపోయారు! ఆ దిగులు, అనారోగ్యపు ఇబ్బందులు పద్మ గారిని మరింత కుంగదీసాయి! కూచిపూడి ఆణిముత్యం పద్మ గారు లేని లోటు తీరనిది! వారికి నివాళి?

Featured

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై బోలా హర్షం.

మనుబోలు (పున్నమి విలేఖరి) 2, ఫిబ్రవరి :కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బిజెపి జిల్లా నాయకులు బోల శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు వివిధ రంగాలకు బడ్జెట్ కేటాయింపులు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు . ఈ బడ్జెట్ వల్ల దేశంలో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతోందని నూతన దశాబ్దంలో ఆర్థికమంత్రి నిర్మలా ప్రవేశపెట్టిన బడ్జెట్​ భారత విశ్వాసాన్ని పెంపొందించుతుంది. ఈ ఆశాజనక, ప్రగతిశీల బడ్జెట్​ వల్ల రానున్న కాలంలో భారత్ ఎంతో ఆరోగ్యవంతంగా, సంపన్న దేశంగా మారుతుంది అని అన్నారు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్దు వల్ల పన్ను చెల్లింపు దారులకు అసాధారణ రీతిలో ఉపశమనం కలుగుతుందని అన్నారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్రం సంకల్పానికి ఈ బడ్జెట్​ ఎన్నో విధాలుగా దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు. రైతులు, పేద, మధ్య తరగతి, వ్యాపార వర్గాలు లబ్ధిపొందే విధంగా బడ్జెట్​​ను రూపొందించిన ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​కు నా అభినందనలు. ధాన్యం నిల్వ, నీటిపారుదలలో విధించిన నిబంధనలు.. రైతుల ఆదాయన్ని రెట్టింపు చేయాలన్న మోదీ ప్రభుత్వ సంకల్పానికి దోహద పడతాయి. మౌలిక వసతులకు ఊతమివ్వడం, సహేతుకమైన పన్ను వ్యవస్థ, సులభతర వాణిజ్యంలో పెట్టుబడులు, బ్యాంకింగ్​ రంగాన్ని బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. బడ్జెట్​ 2020 చా సమతూకంగా ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు

Featured ఆంధ్రప్రదేశ్

కంటేపల్లిలో రైతు శిక్షణా కార్యక్రమం

కంటేపల్లిలో రైతు శిక్షణా కార్యక్రమం వెంకటాచలం, ఫిబ్రవరి 2 (పున్నమి విలేఖరి): మండలంలోని కంటేపల్లిలో మంగళవారం రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు హైమావతి, వ్యవసాయ అధికారి శిరీష, నెల్లూరు రూరల్ సహాయ వ్యవసాయ సంచాలకులు బాలాజీ నాయక్, డాట్ సెంటర్ సైంటిస్ట్ శ్వేత హాజరయ్యారు. వరిలో వచ్చే తెగుళ్లు, పురుగులు, వాటి నియంత్రణకు తీసుకోవలసిన చర్యల గురించి రైతులకు అవగాహన కల్పించారు. అలాగే గ్రామంలో జరుగుతున్న పొలంబడి కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం పక్క గ్రామమైన అనికేపల్లి – 2లో ఆర్బికెని సందర్శించి, వ్యవసాయ సహాయకుడు రికార్డులను తనిఖీ చేశారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మంజుల, కంటేపల్లి, అనికేపల్లి వ్యవసాయ సహాయకులు అభిషేక్, విష్ణువర్ధన్ పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికల్లో నోటా.. గుర్తులు విడుదల

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో తొలి సారిగా నోటా గుర్తును ముద్రించనున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ గుర్తు లేదు. కానీ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని రకాల ఎన్నికల్లో ఈ గుర్తును తప్పనిసరి చేశారు. దీంతో ఏపీలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా ఈ గుర్తును చేర్చారు. అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల అనంతరం చివర్లో నోటాను ముద్రించనున్నారు. మరోవైపు తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనున్న సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యలకు గుర్తులను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. సర్పంచ్ అభ్యర్థులకు మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పు సాసరు, క్యారెట్‌, తాళం చెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్‌, దూరవాణి, బల్ల, మొక్కజొన్న, పలక, దాక్షపళ్లు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనాసపండు, షటిల్‌, చేతికర్ర, చెంచా గుర్తులున్నాయి. ఇక వార్డు సభ్యులకు ఇరవై గుర్తులు కేటాయించారు. అందులో ప్రెషర్‌ కుక్కర్‌, గౌను, స్టూలు, ఇస్త్రీ పెట్టె, పోస్టు డబ్బా, గ్యాస్‌ పొయ్యి, బీరువా, ఐస్‌క్రీమ్‌, కెటిల్‌, కటింగ్‌ ప్లేయర్‌, గరాటా, విద్యుత్ స్తంభం, డిష్‌ యాంటీనా, రంపం, కెమెరా, క్యారమ్‌ బోర్డు, వయోలిన్‌, బెండకాయ, బెల్టు, కోటు గుర్తులున్నాయి.

Featured ఆంధ్రప్రదేశ్

తల్లిదండ్రుల నిర్లక్ష్యం… మీ పిల్లలకే ప్రమాదం…..

బుచ్చిరెడ్డిపాలెము ఫిబ్రవరి 2 ( పున్నమి విలేఖరి) పై ఫొటోలో చూడండి. ఒక మైనర్ బాలుడు ఇంకొక మైనర్ బాలున్ని బైక్ పై కూర్చోబెట్టుకుని రోడ్ల మీద తిరగడం. ఈ చిత్రం బుచ్చిరెడ్డిపాలెము పట్టణంలో ముంబై జాతీయ రహదారిపై అంబేద్కర్ విగ్రహం వద్ద తీసిన దృశ్యం. దీనికి ఎవరు సమాదానం ఇస్తారు. కొందరి నిర్లక్షం వల్ల రోజు రోజుకూ పెరుగుతున్న యాక్షిడెంట్లు. బైక్ డ్రైవింగ్ అంటే ఏదో గొప్పగా నాకొడుకు బైక్ తోలుతున్నాడని నిర్లక్ష్యం వహిస్థే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. పర్యవసానం కొందరు తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తుంది. తల్లిదండ్రులారా దయచేసి ఆలొచించి, మీ ఇళ్లలో ఉండే మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి పంపడం మానుకొండి. అలాగే పోలీసు వారు కూడా ఇలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు ప్రజానికం కోరుకుంటున్నాను.

ఆంధ్రప్రదేశ్

ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి: సోమిరెడ్డి

ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి: సోమిరెడ్డి వెంకటాచలం ఫిబ్రవరి 1 పున్నమి విలేఖరి గత టిడిపి ప్రభుత్వానికి, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి తేడా గమనించి ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజలను కోరారు. సోమవారం మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ నాయకుల దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. వైసీపీ నేతల అక్రమాలకు రెవెన్యూ, పోలీసు అధికారులు వంతపాడటం మంచి పద్ధతి కాదన్నారు. ఎన్నికల సందర్భంగా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే బైండోవర్ చేస్తారా.. ఇది ఎక్కడి చట్టం అని ప్రశ్నించారు. బైండోవర్ పేరుతో టీడీపీ కార్యకర్తలను వేధిస్తే అందరం వచ్చి పోలీసుస్టేషన్లలో కూర్చుంటానని అన్నారు. ఎన్నికలు జరిగేది కాకాణి గోవర్ధన్ రెడ్డో లేక ఇంకొకరి ఆధీనంలోనో కాదని ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో అని గుర్తుంచుకోవాలన్నారు. తమకు ఓపిక నశించే పరిస్థితులు తేవొద్దని పోలీసు, రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. వైసీపీ నాయకులు ఎవరెవరు ఎక్కడెక్కడ, ఎంతెంత అవినీతికి పాల్పడుతున్నారో తమ దగ్గర పక్కా ఆధారాలున్నాయని, త్వరలోనే వాటిని బయట పెడతామన్నారు. చంద్రన్న బీమా, సీఎంఆర్ఎఫ్, పండగ కానుకలు, బీసీ, ఎస్సీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ రుణాలు వంటి ఎన్నో పథకాలు కనిపించకపోయినా కరోనా పేరుతో కలెక్షన్లు ఇసుక, మట్టి, గ్రావెల్ మాఫియా దోపిడీలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక లోడింగ్, ట్రాక్టర్ బాడుగతో కలిపి ట్రక్కు రూ.1200లోపే ఇంటికి వచ్చేదని,ఇప్పుడు ట్రక్కు ఇసుక రూ.7 వేలకు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి టన్ను ఇసుకకు రూ.375 జే ట్యాక్స్ విధిస్తే సర్వేపల్లిలో కాకాని విధించే కే ట్యాక్స్ రూ.4 వేలు అని మొత్తం కలిపి ట్రక్కు ఇసుక రూ.7 వేలకు చేరిందన్నారు. ఫ్యాను గుర్తుకు ఓటేసి, వైసీపీకి అధికారం ఇచ్చినోళ్లు కూడా జే ట్యాక్స్, కే ట్యాక్సులు కట్టాల్సిందేనా అని అన్నారు. గ్రావెల్, మట్టి, ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతుంటే రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు కళ్లు మూసుకుని ఉన్నారని, జనం డబ్బుతో జీతాలు తీసుకుంటూ ఇలా చేయడం సబబు కాదన్నారు. రెండు సార్లు ఓట్లేసి గెలిపించినందుకు రైతులు పుట్టి ధాన్యాన్ని రూ.16 వేలకు బదులు రూ.8 వేలకు అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. జే ట్యాక్సు, కే ట్యాక్సులతో రాష్ట్రం అధోగతి పాలుకాకుండా ఉండాలంటే ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో, అటు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైసీపీకి ప్రజలంతా గుణపాఠం చెప్పాలన్నారు. టిడిపి మండల అధ్యక్షుడు గుమ్మడి రాజు యాదవ్, టిపి గూడూరు మండల అధ్యక్షుడు బొమ్మి సురేంద్ర, నేతలు కుంకాల నాగేంద్రప్రసాద్, మేదరమెట్ల కోదండరామ నాయుడు, గంటా బాబు, తదితరులు పాల్గొన్నారు.

Featured తూర్పు గోదావరి

నిండు జీవితానికి రెండు చుక్కలు*

ఆలమూరు జనవరి 31 (పున్నమి విలేఖరి): పోలియో మహమ్మారిని పార దోలేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలని పెద్దపల్ల, చొప్పెల్ల పీహెచ్సీ వైద్యులు ఆర్ సుదర్శన్ బాబు, ఎం సుమలత పేర్కొన్నారు. ఆలమూరు మండలం గ్రామ పంచాయతీల పరిధిలో చిన్నారులకు పోలియో చుక్కల కేంద్రాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు రెండు చుక్కలు వేయిస్తే పోలియో మహమ్మారి దరి చేరదని, ప్రభుత్వం ప్రతి సంవత్సరమూ జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయిస్తుంది. ప్రభుత్వం వేసే పోలియో చుక్కలే కాకుండా తల్లిదండ్రులు తమ వీలును బట్టి పోలియో చుక్కలు సమీప ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వేయించాలన్నారు. దగ్గు, జ్వరం, జలుబు, విరేచనాలు, ఏ ఇతర జబ్బులు వచ్చినా పోలియో చుక్కలు తప్పని సరిగా వేయించాలని తెలియజేశారు. 19వ శతాబ్దంలో మొదటి సారిగా పోలియో వ్యాధిన పడ్డ చిన్నారులను వైద్యులు గుర్తించి ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందనారు. ఈ వ్యాధి సొకితే చిన్నారుల కాళ్లు, చేతులపై ప్రభావం చూపి అవి పనిచేయకుండా పోతాయని, ఈ వ్యాధి వైరస్‌ టైప్‌-1, టైప్‌-2, టైప్‌-3 వల్ల వస్తుంది. ఈ వైరస్‌ చిన్నారుల శరీరంలో ఉండి పోలియో వ్యాధి రావడానికి కారణమవుతుందని, పోలియో చుక్కలు సంవత్సరంలో రెండు సార్లు వేయించాలని. ఈ చుక్కలు పోలియో వైరస్‌ మీద సైనికుల్లా పోరాటం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ కీలకపాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.

Featured

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో జాతిపిత “మహాత్మాగాంధీ” వర్ధంతి

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో జాతిపిత “మహాత్మాగాంధీ” వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి..పూలమాలవేసి రెక్టర్ ఆచార్య. ఎం చంద్రయ్య గారు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ క్రిష్ణ రెడ్డి గారు, నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను గుర్తు చేసుకుంటూ..అందరూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య గారు,రిజిస్ట్రార్ ఎల్ విజయక్రిష్ణ రెడ్డి గారు,కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య. సుజ ఎస్ నాయర్ గారు, మరియు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సాయి ప్రసాద్ రెడ్డి గారు అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుజాయ్ గారు, పి ఆర్ ఓ నీలమణీ కంట గారు, మరియు బోధ, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు._