Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Blog

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

కుటుంబ సభ్యులు మరణిస్తే – కంపెనీ లీవ్‌ ‌పాలసీలు !

ఈ ఆర్టికల్‌ ‌క్రింది ఉద్యోగులకు కాక ముఖ్యంగా మేనేజిమెంటు వారి కోసం, పదిమంది తమకు రిపోర్టు చేసే స్థాయిలో ఉన్న మేనేజర్‌ల కోసం రాయబడింది. ముఖ్యంగా శెలవు మంజూరు చేసే, లేదా తిప్పి కొట్టే అధికారం ఉన్న వారి కోసం. ‘శెలవు’ అనేది తమ హక్కుగా ఉద్యోగులు భావిస్తారు. శెలవు అనేది బాధ్యతగా వాడాలనీ, అవసరం ఉంటేనే వాడాలనీ, ఉన్నాయి కదా? సంవత్సరాంతంలో మిగిలి పోయాయి కదా ? ‘మురిగి పోతాయేమో’ (వాడని లీవులు) అని అవసరం ఉన్నా లేకున్నా డిసెంబరులో సగం రోజులు శెలవు పెట్టే ప్రాక్టీసును పై అధికారులు హర్షించరు!! సరే వీటి న్యాయాన్యాయాలు తరువాత చూద్దాం ! ఇప్పుడు కరోనా ప్యాండమిక్‌ ‌వచ్చి వ్యాపారలనూ, పని తీరునూ, పని చేసే విధానాన్నీ ( వీలైన చోట్ల వర్క్ ‌ఫ్రం హోం) సమూలంగా మార్చి వేసింది. ఉద్యోగినీ ఉద్యోగులు, పై స్థాయి మేనేజర్‌ల మధ్య సంబంధాలను కూడా మార్చి వేసింది. కొన్ని చోట్ల అవి మెరుగు పడ్డాయి, కొన్ని చోట్ల దెబ్బతిన్నాయి. సెలవు దొరకడం అత్యంత కష్టమైన , అత్యవసర సర్విసుల లో (ప్రభుత్వ మరియు ప్రైవేటు) పని చేసే కొందరు మిత్రులతో మాట్లాడుతూనే ఉన్నాను. ‘‘మీ దగ్గర శెలవు దొరకడం కష్టం కదా? ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి?’’అని. ఒక గుడ్‌ ‌న్యూసు ఏమిటంటే, చాలా చోట్ల, మన వాడు ఫోన్‌ ‌చేసి, ‘నాకు జలుబు దగ్గు ఉంది సార్‌ / ‌మేడం ! మాస్కు కట్టుకుని రానా మరి?’ అని దాదాపు బెదిరించే టెర్రరిష్టు ధోరణిలో అడగడం, పై వారేమో ‘ఆహా వద్దు వద్దు ! కావాలంటే నువ్వు వారం శెలవు తీసుకో !’ అని ‘ఆరోగ్యం జాగ్రత్త’ అని ముక్తాయిస్తున్నారట! మన వాళ్ళు కొంత రిలీఫ్‌తో చెప్పారు. మీరు ఒక కంపెనీని నడుపుతూ ఉంటే, లేదా మీరు పర్యవేక్షక / లేదా పై స్థాయిలో పని చేసే సీనియర్‌ అధికారి (ణి) అయితే, మా వైపు నుంచి కొన్ని విజ్ఞప్తులు! (1) కుటుంబ సభ్యులని కోల్పోయిన ఉద్యోగులు దుఃఖంతో ఉంటారు. దశదిన కర్మ కంటే ఎక్కువ రోజులు, వారు మానసికంగా కోలుకునే వరకూ జీతం కూడిన లీవు ఇవ్వండి. (2) వారు శెలవులో ఉన్నప్పుడు, రెండు మూడు సార్లు ఫోన్‌ ‌చెయ్యండి. ఏమైనా సహాయం కావాలా అడగండి. ఇల్లు దగ్గర ఉంటే ఒకసారి పర్సనల్‌గా వెళ్ళి పరామర్శించండి. డబ్బు సాయం, ఆఫీసు నుంచి అడ్వాన్సు ఇప్పించడం, ఏవైనా ఆఫీసుల నుంచి నింపవలసిన దస్తావేజులు ఉంటే వాటిని తెప్పించి ఇవ్వడం, ఇలా ఏదైనా? (3) ఎవరెవరు చనిపోతే జీతంతో కూడిన లీవు ఇవ్వాలి? ఈ కరోనా సమయంలో ఇది సంక్లిష్టమైన ప్రశ్న. కేవలం కుటుంబానికే పరిమితం చేయకండి! (4) ‌మన మందరం ఎన్నో సంఘటనలు చూశాం, చదివాం. మన లొకాలిటీలో ఎవరో కరోనా బారిన పడి చనిపోతారు. వారి పిల్లలు పెళ్ళయి, ఇక్కడ లేక పోవచ్చు. ఈ దేశంలోనే లేక పోవచ్చు. వారు వచ్చే దాకా, చుట్టు పక్కల వారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఎన్నో పనులు చేయాల్సి రావచ్చు. శవాన్ని ఐస్‌ ‌బాక్సులో ఉంచడం లాంటివి . అందరూ ఉండి, ఆపత్కాలంలో ఎవరూ లేని అనాధలుగా చనిపోయే దయనీయ స్థితులను గత సంవత్సర కాలంగా ఎన్నో చూశాం కాబట్టి, కేవలం భార్య / భర్త / పిల్లలు / తల్లిదండ్రులే కాక, అత్త, పిన్ని, బాబాయి, మామయ్య ,చుట్టాలు, పక్కాలు, ఇలా ఎవరు హఠాత్తుగా గతించినా, మీ ఉద్యోగులలో ఒకరు ఆ కారణంగా లీవు అడిగినా, ఈ విపత్కర సమయంలో కాదనకండి, కాస్త పెద్ద మనసు చేసుకుని, మంజూరు చేయండి. ఏమి జరుగుతోందో, కనిపెట్టి ఉండి, కనుక్కోండి. (5) మీకు వాస్తవం తెలిస్తే, మీ ఉద్యోగి (ని) మరణానికి సంబంధించిన డెత్‌ ‌సర్టిఫికేటు, శ్మశానం నుంచి పత్రం, లేక డాక్టర్‌ ‌సర్టిఫికేటు, అలాంటివి అడగకండి . మరీ తప్పని సరి అయితే తప్ప, ఇలాంటి దస్తావేజులు లేకుండానే లీవు అప్రూవ్‌ అయేలా చూడండి. (6) మీ సంస్థ, ఎవరైనా సైకాలజిస్టుతో వ్యాపార ఒప్పందం అయి ఉందా? విపరీమైన మానసిక వత్తిడి ఉండి, పనిలో లీనం కాలేకపోతున్న ఉద్యోగులకు కాస్త కౌన్సెలింగ్‌ ఇప్పించండి. కంపెనీ ఖర్చుతో. ఆ సమయంలో అది వారికి అవసరం కావచ్చు. వీటిలో ఏవి వీలైతే అవి మీ సంస్థలో అమలు చేయండి. ఈ దేశం, ఆ దేశం అని కాకుండా, ప్రపంచం మొత్తం ఇలాంటి జీవన్మరణ సమస్యలో ఉన్నప్పుడు, మనం ఒకరి పట్ల ఒకరు కారుణ్యంతో, కాస్త పెద్ద మనసుతో మెలగడమే పరిష్కారం. ఆపత్కాలంలో మీరు చేసిన మేలు, మీ ఉద్యోగులు ఎన్నటికీ మరిచిపోరు. చాలా కాలం గుర్తు ఉంచుకుంటారు. పదిమందికి చెబుతారు. C.V.Ramana, Hyderabad

Featured ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై బుచ్చి లో ఆర్డీవో పర్యటన

బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన నెల్లూరు జిల్లా ఆర్డివో హుస్సేన్ సాహెబ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో, తాసిల్దార్ లకు ఎన్నికలు నిర్వహించవలసిన విధివిధానాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించబడునని, 16వ తేదీ ఉపసంహరణలను పరిశీలించి పూర్తి నివేదిక అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరసింహారావు, తాసిల్దార్ షఫీ మాలిక్, స్పెషల్ ఆఫీసర్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

వైసిపి నుండి టిడిపిలోకి వలస

బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామనికి చెందిన వైసీపీ పార్టీ చెందిన సీనియర్ నాయకులు ఆళ్ల శివ అతని అనుచరులతో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యమ్ వి శేషయ్య మరియు తెలుగుదేశం పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షుడు కోటేశ్వరరావు ఆద్వర్యంలో కోవూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు… ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెంపాలెం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు..

Featured ఆంధ్రప్రదేశ్

నేడు రైతులకు శిక్షణా కార్యక్రమాలు

నేడు రైతులకు శిక్షణా కార్యక్రమాలు వెంకటాచలం, ఫిబ్రవరి 7 (పున్నమి విలేఖరి): మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంఏఓ మంజుల ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఏటిఎంఏ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు వెల్లడించారు. పంటల యాజమాన్య పద్ధతులు, ఈ పంట నమోదు – ఆవశ్యకత, ధాన్యం కొనుగోలు కేంద్రాలు – నాణ్యత ప్రమాణాలు, తదితర విషయాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

కుటుంబ సభ్యులు మరణిస్తే – కంపెనీ లీవ్ పాలసీ లు !

కుటుంబ సభ్యులు మరణిస్తే – కంపెనీ లీవ్ పాలసీ లు ! ఈ ఆర్టికల్ క్రింది ఉద్యోగులకు కాక ముఖ్యం గా మేనేజిమెంటు వారి కోసం , పదిమంది తమకు రిపోర్టు చేసే స్థాయి లో ఉన్న మేనేజర్ ల కోసం రాయబడింది. ముఖ్యం గా, శెలవు మంజూరు చేసే , లేదా తిప్పి కొట్టే అధికారం ఉన్న వారి కోసం .  ‘ శెలవు ‘అనేది తమ హక్కు గా ఉద్యోగులు భావిస్తారు . శెలవు అనేది బాధ్యత గా వాడాలనీ , అవసరం ఉంటేనే వాడాలనీ, ఉన్నాయి కదా ? సంవత్సరాంతం లో మిగిలి పోయాయి కదా ? ‘ మురిగి పోతాయేమో ‘ ( వాడని లీవులు ) అని అవసరం ఉన్నా లేకున్నా డిసెంబరులో సగం రోజులు శెలవు పెట్టే ప్రాక్టీసు ను  పై అధికారులు  హర్షించరు !! సరే వీటి న్యాయాన్యాయాలు తరువాత చూద్దాం ! ఇప్పుడు కరోనా ప్యాండమిక్ వచ్చి వ్యాపారలనూ, పని తీరునూ, పని చేసే విధానాన్నీ ( వీలైన చోట్ల వర్క్ ఫ్రం హోం ) సమూలం గా మార్చి వేసింది . ఉద్యోగినీ ఉద్యోగులు , పై స్థాయి మేనేజర్ ల మధ్య సంబంధాలను కూడా మార్చి వేసింది . కొన్ని చోట్ల అవి మెరుగు పడ్డాయి, కొన్ని చోట్ల దెబ్బ తిన్నాయి . సెలవు దొరకడం అత్యంత కష్టమైన , అత్యవసర సర్విసుల లో ( ప్రభుత్వ మరియు ప్రైవేటు ) పని చేసే కొందరు మిత్రులతో మాట్లాడుతూ నే ఉన్నాను . ” మీ దగ్గర శెలవు దొరకడం కష్టం కదా ? ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి ? ” అని . ఒక గుడ్ న్యూసు ఏమిటంటే , చాలా చోట్ల , మన వాడు ఫోన్ చేసి , ‘ నాకు జలుబు దగ్గు ఉంది సార్ / మేడం ! మాస్కు కట్టుకుని రానా మరి ? ‘ అని దాదాపు బెదిరించే టెర్రరిష్టు ధోరణి లో అడగడం , పై వారేమో ‘ ఆహా వద్దు వద్దు ! కావాలంటే నువ్వు వారం శెలవు తీసుకో ! ” అని , ‘ ఆరోగ్యం జాగ్రత్త ‘ అని ముక్తాయిస్తున్నారట ! మన వాళ్ళు కొంత రిలీఫ్ తో చెప్పారు .  మీరు ఒక కంపెనీ ని నడుపుతూ ఉంటే, లేదా మీరు పర్యవేక్షక / లేదా పై స్థాయి లో పని చేసే సీనియర్ అధికారి ( ణి ) అయితే, మా వైపు నుంచి కొన్ని విజ్ఞప్తులు ! (1)   కుటుంబ సభ్యులని కోల్పోయిన ఉద్యోగులు దుఃఖం తో ఉంటారు . దశదిన కర్మ కంటే ఎక్కువ రోజులు, వారు మానసికం గా కోలుకునే వరకూ జీతం కూడిన లీవు ఇవ్వండి . (2)   వారు శెలవు లో ఉన్నప్పుడు, రెండు మూడు సార్లు ఫోన్ చెయ్యండి . ఏమైనా సహాయం కావాలా అడగండి . ఇల్లు దగ్గర ఉంటే ఒకసారి పర్సనల్ గా వెళ్ళి పరామర్శించండి . డబ్బు సాయం, ఆఫీసు నుంచి అడ్వాన్సు ఇప్పించడం , ఏవైనా ఆఫీసుల నుంచి నింపవలసిన  దస్తావేజులు ఉంటే వాటిని తెప్పించి ఇవ్వడం, ఇలా ఏదైనా ? (3)   ఎవరెవరు చనిపోతే జీతం తో కూడిన లీవు ఇవ్వాలి ? ఈ కరోనా సమయం లో ఇది సంక్లిష్టమైన ప్రశ్న . కేవలం కుటుంబానికే పరిమితం చేయకండి! (4)   మనమందరం ఎన్నో సంఘటనలు చూశాం , చదివాం . మన లొకాలిటీ లో ఎవరో వృద్ధులు కరోనా బారిన పడి చనిపోతారు . వారి పిల్లలు పెళ్ళయి , ఇక్కడ లేక పోవచ్చు . ఈ దేశం లో నే లేక పోవచ్చు. వారు వచ్చే దాకా , చుట్టు పక్కల వారు, ఫ్యామిలీ ఫ్రండ్స్ , ఎన్నో పనులు చేయాల్సి రావచ్చు . శవాన్ని ఐస్ బాక్సు లో ఉంచడం లాంటివి . అందరూ ఉండి, ఆపత్కాలం లో ఎవరూ లేని అనాధలు  గా చనిపోయే దయనీయ స్థితులను గత సంవత్సర కాలం గా ఎన్నో చూశాం . కాబట్టి, కేవలం భార్య / భర్త / పిల్లలు / తల్లిదండ్రులే కాక , అత్త, పిన్ని, బాబాయి, మామయ్య ,చుట్టాలు, పక్కాలు, ఇలా ఎవరు హఠాత్తు గా గతించినా, మీ ఉద్యోగులలో ఒకరు ఆ కారణం గా లీవు అడిగినా, ఈ విపత్కర సమయం లో కాదనకండి , కాస్త పెద్ద మనసు చేసుకుని , మంజూరు చేయండి . ఏమి జరుగుతోందో , కనిపెట్టి ఉండి , కనుక్కోండి. (5)   మీకు వాస్తవం తెలిస్తే, మీ ఉద్యోగి ( ని ) మరణానికి సంబంధించిన డెత్ సర్టిఫికేటు , శ్మశానం నుంచి పత్రం , లేక డాక్టర్ సర్టిఫికేటు, అలాంటివి  అడగకండి . మరీ తప్పని సరి అయితే తప్ప , ఇలాంటి దస్తావేజులు లేకుండానే లీవు అప్రూవ్ అయేలా చూడండి . (6)   మీ సంస్థ , ఎవరైనా సైకాలజిస్టు తో వ్యాపార ఒప్పందం అయి ఉందా ? విపరీమైన మానసిక వత్తిడి ఉండి, పని లో లీనం కాలేక పోతున్న ఉద్యోగులకు కాస్త కౌన్సెలింగ్ ఇప్పించండి . కంపెనీ ఖర్చు తో . ఆ సమయం లో అది వారికి అవసరం కావచ్చు .  వీటిలో ఏవి  వీలైతే అవి మీ సంస్థ లో అమలు చేయండి. ఈ దేశం , ఆ దేశం అని కాకుండా, ప్రపంచం మొత్తం ఇలాంటి జీవన్మరణ సమస్య లో ఉన్నప్పుడు , మనం ఒకరి పట్ల ఒకరు కారుణ్యం తో, కాస్త పెద్ద మనసుతో మెలగడమే పరిష్కారం . ఆపత్కాలం లో మీరు చేసిన మేలు, మీ ఉద్యోగులు ఎన్నటికీ మరిచిపోరు . చాలా కాలం గుర్తు ఉంచుకుంటారు . పదిమందికి చెబుతారు. CV Ramana, Hyderabad.

Featured ఆంధ్రప్రదేశ్

శాంతియుత ఎన్నికల నిర్వహణకు కృషి

శాంతియుత ఎన్నికల నిర్వహణకు కృషి వెంకటాచలం, ఫిబ్రవరి 6 (పున్నమి విలేఖరి): సర్వేపల్లి నియోజకవర్గంలో శాంతియుత ఎన్నికల నిర్వహణకు తాము కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నిడిగుంటపాళెంలో కట్టంరెడ్డి విజయ్ మోహన్ రెడ్డి నివాసంలో శనివారం విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో గొడవలను నివారించాలని, ఏకగ్రీవాలకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన కోరారు. పంచాయతీలు ఏకగ్రీవాలు అయితే ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతాయని, వాటితో గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఏకగ్రీవం అయిన చోట అప్పుడే దృవీకరణ పత్రాలు ఇవ్వొద్దని అధికారులను ఎస్ ఈ సి ఆదేశించడం సమర్థనీయం కాదన్నారు. ఏకగ్రీవాలు అనేది అనాది కాలం నుంచి వస్తుందని, ఇదేం కొత్తది కాదన్నారు. తాను అధికార పార్టీ శాసన సభ్యుడిగా ఎన్నికైన 18 నెలలకే నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని స్పష్టం చేశారు. సోమిరెడ్డి మంత్రిగా 15 ఏళ్లల్లో చేయలేనిది తాను 18 నెలల్లో చేసి చూపానని వెల్లడించారు. నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా సరే తమకంటే ఎక్కువ అభివృద్ధి చేసినట్లు సోమిరెడ్డి నిరూపిస్తే ఈ ఎన్నికల్లో ఆ పంచాయతీ వాళ్లకే వదిలేస్తామన్నారు. గ్రామాల్లో చిచ్చు రేపేందుకు టిడిపి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎవరు కూడా సోమిరెడ్డి, ఆ పార్టీకి చెందిన కొందరు చోటామోటా నాయకుల ఉచ్చులో పడొద్దని సూచించారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కనుపూరు కోదండరామిరెడ్డి, కట్టంరెడ్డి విజయ్ మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మందల వెంకట శేషయ్య, కొనిదెన భాస్కర్ నాయుడు, మోహన్ నాయుడు, అడపాల ఏడుకొండలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ..

  దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా జి. వాణీమోహన్ నియామకం.. పురావస్తు శాఖ కమిషనర్ గా వాణీమోహన్ కు పూర్తి అదనపు బాధ్యతలు… ఆప్కో ఎండీ, సహకార శాఖ కమీషనర్ గా బాబు.ఎ కు పూర్తి అదనపు బాధ్యతలు… రవాణా,రోడ్లు,భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి గా అర్జా శ్రీకాంత్ నియామకం.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా జి. జయలక్ష్మి కి పూర్తి అదనపు బాధ్యతలు..

Featured

సత్తా చాటిన నెల్లూరు బిడ్డ

_నెల్లూరు జిల్లా విద్యార్థినికి అభినందనలు తెలిపినా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు_* _జనవరి 26 ఢిల్లీ లో జరిగిన గణతంత్ర దినోత్సవం వేడుకలో NCC డ్రిల్ల్ ని విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల అయిన కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలకు చెందిన చిలకపాటి జ్యోత్స్న ను ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సీఎం క్యాంపు కార్యాలయంలో అభినందించి 2లక్షల రూపాయలను బహుమతిని అందజేశారు._

Featured

జడ్పీ లో 100% కోవిద్ వ్యాక్సిన్ :CEO సుశీల

జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈవో శ్రీమతి పి సుశీల ఆధ్వర్యంలో జడ్పీ ఉద్యోగులు కోవేట్ వ్యాక్సిన్ను విజయవంతంగా 100% వ్యాక్సిన్ను ఉద్యోగులందరూ వేసుకున్నారు ఈ కార్యక్రమంలో జడ్పి సీఈవో శ్రీమతి పి సుశీల దగ్గరుండి ప్రతి ఉద్యోగి వ్యాక్సిన్ వేసి ఉద్యోగుల బాగోగులను దగ్గరుండి చూసుకున్నారు వారికి పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లక్కాకుల పెంచలయ్య కృతజ్ఞతలు తెలియజేశారు కలెక్టర్ గారికి కృతజ్ఞతలు జడ్పీ ఉద్యోగులకు కోవిద్ వ్యాక్సిన్ను వేయించుట కు సహాయం చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ kvn చక్రధర్ బాబు గారికి మరియు జడ్పీ సీఈవో శ్రీమతి పి సుశీల గారికి పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసినారు

Featured ఆంధ్రప్రదేశ్

అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన అనంతసాగరం వైసీపీ అభ్యర్థి

గురువారం అనంతసాగరం జనసంద్రంగా మారింది అశేష జనవాహినితో కలిసి రాపూరు వెంకట సుబ్బారెడ్డి గారు బట్రెడ్డి జనార్థన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అట్టహాసంగా వైసిపి సర్పంచ్ అభ్యర్థి కమతం శోభ తన నామినేషన్ దాఖలు చేశారు వీరితో పాటు 14 వార్డులకు గాను 14 మంది వార్డు నెంబర్ లు కూడా నామినేషన్ దాఖలు చేశారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కు సంబంధించి అనంతసాగరం మండలం లో నామినేషన్ల చివరి రోజు ముగిసేనాటికి మొత్తం 25 గ్రామపంచాయతీలకు 121 సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు అలాగే మండలంలో మొత్తం 226 వార్డులకు గాను 465 మంది దాఖలు చేశారు మండలంలోని చిలకమర్రి గ్రామంలో ఒకే ఒక్క సర్పంచ్ నామినేషన్ దాఖలు చేశారు అధికారులు ఏకగ్రీవం ప్రకటించడమే తరువాయి