(పున్నమి ప్రతినిధి)
పెర్నపాడు, సెప్టెంబర్ 30: పోషణ మాసం, సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా పెర్నపాడు అంగన్వాడి కేంద్రంలో బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లులను ఉద్దేశించి ఐసీడీఎస్ సూపర్వైజర్ కే. హసీనా సమతుల్య పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా అందించే పోషకాహారాన్ని సకాలంలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి లక్షణాలను తల్లిదండ్రులు గమనించాలని తెలిపారు. ప్రాథమిక విద్యపై అవగాహన కల్పిస్తూ పిల్లల హాజరు శాతం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వెంగళరెడ్డి, అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు పాల్గొన్నారు.



