అరకులోయ మండలం సుంకరమెట్ట పంచాయతీ కేంద్రంలో సోమవారం పోషణ్ మాసం కార్యక్రమం నిర్వహించారు. సూపర్వైజర్ రామకృష్ణమ్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీడీపీఓ లక్ష్మీలావణ్య, ఎంపీడీఓ ప్రసాద్, ఎంఆర్ఓ రాజా శ్రీధర్, ఎంఈఓ-2 భారతీరత్నం పాల్గొన్నారు. పోషకాహారం, బాలల వికాసంపై ర్యాలీ నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు మాతృ వందన పథకం ప్రయోజనాలు పొందాలని, అంగన్వాడీ పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలు శాంతి, ధన, సంగీత ఉన్నారు.

అరకు: బాలల వికాసానికి పౌష్టికాహారం చాలా ముఖ్యం