Wednesday, 30 September 2026
  • Home  
  • వర్మీ కంపోస్ట్‌తో గ్రామాల్లో స్వచ్ఛతకు కొత్త దిశ కొత్తపల్లి SWPCలో గ్రీన్ అంబాసిడర్లు, PDOలకు ఎక్స్‌పోజర్ విజిట్ – వర్మీ తయారీపై ప్రాయోగిక శిక్షణ
- కడప

వర్మీ కంపోస్ట్‌తో గ్రామాల్లో స్వచ్ఛతకు కొత్త దిశ కొత్తపల్లి SWPCలో గ్రీన్ అంబాసిడర్లు, PDOలకు ఎక్స్‌పోజర్ విజిట్ – వర్మీ తయారీపై ప్రాయోగిక శిక్షణ

(పున్నమి ప్రతినిధి) వేముల మండలం, సెప్టెంబర్ 30: గ్రామాల్లో సేంద్రియ వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించి పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పడంతో పాటు వర్మీ కంపోస్ట్ తయారీని ప్రోత్సహించే దిశగా వేముల మండలంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి గ్రామ పంచాయతీ SWPC షెడ్‌లో 16 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లు, 16 గ్రామ పంచాయతీల పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్లకు వర్మీ కంపోస్ట్ తయారీ, నిర్వహణపై ఎక్స్‌పోజర్ విజిట్–శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మీ కంపోస్ట్ తయారీకి అవసరమైన సేంద్రియ వ్యర్థాల ఎంపిక, వర్మీ తొట్టి ఏర్పాటు, పేడ, ఇతర సేంద్రియ పదార్థాల వినియోగం, తేమ నిర్వహణ, వర్మీ పురుగుల సంరక్షణ, కంపోస్ట్ తయారీ విధానం, SWPC షెడ్ నిర్వహణ వంటి అంశాలను ప్రాయోగికంగా వివరించారు. గ్రామాల్లో సేకరించే సేంద్రియ వ్యర్థాలను వృథాగా పారవేయకుండా శాస్త్రీయ పద్ధతిలో వినియోగించి వర్మీ కంపోస్ట్‌గా మార్చడం ద్వారా గ్రామ పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఉపయోగకరమైన సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చని అవగాహన కల్పించారు. “వ్యర్థం కాదు – వనరు” అనే భావనతో ప్రతి గ్రామంలో సేంద్రియ వ్యర్థాల నిర్వహణను బలోపేతం చేయాలని, SWPCలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వర్మీ కంపోస్ట్ తయారీని నిరంతరం కొనసాగించాలని సూచించారు. గ్రీన్ అంబాసిడర్లు గ్రామస్థాయిలో వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని అమలు చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో MPDO యం. శారదమ్మ, Dy.MPDO, FTC అమరనాథ రెడ్డి, సంబంధిత పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, పంచాయతీ సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు. వేముల మండలంలో స్వచ్ఛత, సేంద్రియ వ్యర్థాల సద్వినియోగం, వర్మీ కంపోస్ట్ తయారీ లక్ష్యంగా ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

(పున్నమి ప్రతినిధి)
వేముల మండలం, సెప్టెంబర్ 30: గ్రామాల్లో సేంద్రియ వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించి పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పడంతో పాటు వర్మీ కంపోస్ట్ తయారీని ప్రోత్సహించే దిశగా వేముల మండలంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి గ్రామ పంచాయతీ SWPC షెడ్‌లో 16 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లు, 16 గ్రామ పంచాయతీల పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్లకు వర్మీ కంపోస్ట్ తయారీ, నిర్వహణపై ఎక్స్‌పోజర్ విజిట్–శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వర్మీ కంపోస్ట్ తయారీకి అవసరమైన సేంద్రియ వ్యర్థాల ఎంపిక, వర్మీ తొట్టి ఏర్పాటు, పేడ, ఇతర సేంద్రియ పదార్థాల వినియోగం, తేమ నిర్వహణ, వర్మీ పురుగుల సంరక్షణ, కంపోస్ట్ తయారీ విధానం, SWPC షెడ్ నిర్వహణ వంటి అంశాలను ప్రాయోగికంగా వివరించారు. గ్రామాల్లో సేకరించే సేంద్రియ వ్యర్థాలను వృథాగా పారవేయకుండా శాస్త్రీయ పద్ధతిలో వినియోగించి వర్మీ కంపోస్ట్‌గా మార్చడం ద్వారా గ్రామ పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఉపయోగకరమైన సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చని అవగాహన కల్పించారు.

“వ్యర్థం కాదు – వనరు” అనే భావనతో ప్రతి గ్రామంలో సేంద్రియ వ్యర్థాల నిర్వహణను బలోపేతం చేయాలని, SWPCలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వర్మీ కంపోస్ట్ తయారీని నిరంతరం కొనసాగించాలని సూచించారు. గ్రీన్ అంబాసిడర్లు గ్రామస్థాయిలో వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని అమలు చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో MPDO యం. శారదమ్మ, Dy.MPDO, FTC అమరనాథ రెడ్డి, సంబంధిత పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, పంచాయతీ సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు. వేముల మండలంలో స్వచ్ఛత, సేంద్రియ వ్యర్థాల సద్వినియోగం, వర్మీ కంపోస్ట్ తయారీ లక్ష్యంగా ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.