Wednesday, 30 September 2026
  • Home  
  • జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు పీపీగా గంగిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఘన సన్మానం
- కడప

జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు పీపీగా గంగిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఘన సన్మానం

జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు పీపీగా గంగిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఘన సన్మానం కడప, సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి): కడప జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)గా గంగిరెడ్డి శివశంకర్ రెడ్డి నియమితులైన సందర్భంగా ఆయనకు పలువురు న్యాయవాదులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గంగిరెడ్డి శివశంకర్ రెడ్డి పీపీగా నియమితులు కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. న్యాయ రంగంలో ఆయనకున్న అనుభవం, సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని పేర్కొన్నారు. కొత్తగా చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ న్యాయ వ్యవస్థ పట్ల అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు కీలకమైనవని, ప్రజలకు న్యాయం అందేలా చట్టపరమైన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగేలా తన వంతు కృషి చేయాలని అభినందనలు తెలిపారు. పీపీగా నియామకం కావడంతో గంగిరెడ్డి శివశంకర్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు న్యాయవాదులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ నాయకులు శ్రీనివాసులు, పుల్లయ్యతో పాటు పలువురు న్యాయవాదులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు పీపీగా గంగిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఘన సన్మానం

కడప, సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి):

కడప జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)గా గంగిరెడ్డి శివశంకర్ రెడ్డి నియమితులైన సందర్భంగా ఆయనకు పలువురు న్యాయవాదులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

గంగిరెడ్డి శివశంకర్ రెడ్డి పీపీగా నియమితులు కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. న్యాయ రంగంలో ఆయనకున్న అనుభవం, సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని పేర్కొన్నారు. కొత్తగా చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ న్యాయ వ్యవస్థ పట్ల అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు కీలకమైనవని, ప్రజలకు న్యాయం అందేలా చట్టపరమైన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగేలా తన వంతు కృషి చేయాలని అభినందనలు తెలిపారు.

పీపీగా నియామకం కావడంతో గంగిరెడ్డి శివశంకర్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు న్యాయవాదులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్టీ నాయకులు శ్రీనివాసులు, పుల్లయ్యతో పాటు పలువురు న్యాయవాదులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.