



మనుబోలు (పున్నమి విలేఖరి)1,ఏప్రిల్: నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కాగితాల పూర్ గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు బోలా శ్రీనివాసులు 47 జన్మ దినాన్ని పురస్కరించుకొని మనుబోలు శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ఆలయం వద్ద జిల్లా బిజెపి నేత బోల శ్రీనువాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలను నాటారు. జిల్లా బిజెపి నేత బోలా శ్రీనివాసులు జన్మదిన సందర్భంగా బిజెపి నాయకులు ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి ఎదిగిన బోలాను పలువురు బీజేపీ నేతలు అభినందించడం విశేషం .మండల వ్యాప్తంగా బిజెపి నాయకులు జిల్లా బిజెపి నేత పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బిజెపి నాయకులు మాట్లాడుతూ బోలా శ్రీనివాసులు వివాదరహితుడిగా అని మంచి మనిషి అని అందరినీ పార్టీలో కలుపుకొని పోయేవ్యక్తి అని దాదాపు 30 సంవత్సరాల నుంచి బిజెపి పార్టీలో పనిచేస్తూ బిజెపి పార్టీ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని అన్నారు దేశభక్తి భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకుఅనేక పదవులు నిర్వహించారని భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని అని తెలిపారు .
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి,ప్రతాప్, చల్ల లక్ష్మయ్య, ఆంజనేయులు కృష్ణారెడ్డి ,పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

