
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది.కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,01,139 పాజిటివ్ కేసులు నమోదవ్వగా..3,163 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 4,970 కేసులు నమోదవ్వగా…134 మంది చనిపోయారంది.ప్రస్తుతం భారత్ లో 58,802 యాక్టీవ్ కేసులు ఉన్నాయని, ఇప్పటివరకు 39,173 మంది డిశ్చార్జ్ అయ్యారంది.

