వార్త ముఖ్యాంశాలు
- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 29 (పున్నమి ప్రతినిధి) చెర్లోపల్లిలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన అల్లూరు కిరణ్ తేజకు మద్దతుగా గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలిశారు.
- ఈ సందర్భంగా మంచం గుర్తును చూపిస్తూ, ఆ గుర్తుపై ఓటు వేయాలని కోరారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 29 (పున్నమి ప్రతినిధి)
చెర్లోపల్లిలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన అల్లూరు కిరణ్ తేజకు మద్దతుగా గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా మంచం గుర్తును చూపిస్తూ, ఆ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. అలాగే వార్డు మెంబర్ అభ్యర్థులను పరిచయం చేస్తూ, వారి వారి ఎన్నికల గుర్తులను చూపించారు. సర్పంచ్‌తో పాటు వార్డు మెంబర్ అభ్యర్థులకు కూడా తమ ఓటు వేయాలని ఓటర్లకు వివరించారు. ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్