Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోటితీర్థం సర్పంచ్‌గా అరిగి పెంచలయ్య విజయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కోటితీర్థం సర్పంచ్‌గా అరిగి పెంచలయ్య విజయం

వార్త ముఖ్యాంశాలు

  • చేజర్ల :::: చేజర్ల మండలం కోటితీర్థం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడు అరిగి పెంచలయ్య ఘన విజయం సాధించారు.
  • తన సమీప ప్రత్యర్థి అరిగి పెంచల నరసయ్యపై 64 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
  • ఈ ఎన్నికల్లో పెంచలయ్యకు గ్రామ ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది.

చేజర్ల :::: చేజర్ల మండలం కోటితీర్థం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడు అరిగి పెంచలయ్య ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అరిగి పెంచల నరసయ్యపై 64 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పెంచలయ్యకు గ్రామ ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. గ్రామ పంచాయతీలోని మొత్తం 8 వార్డులకు గాను 6 వార్డులను వైసీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. దీంతో పంచాయతీలో వైసీపీ మద్దతుదారులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నట్లయింది. సర్పంచ్‌గా అరిగి పెంచలయ్య విజయం సాధించడంతో ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో సంబరాలు జరుపుకుంటూ విజేతకు అభినందనలు తెలిపారు. ఈ విజయంతో కోటితీర్థం గ్రామంలో వైసీపీ మద్దతుదారుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *