వార్త ముఖ్యాంశాలు
- గండిపాలెం గ్రామంలోని బీసీ కాలనీలో భారీ కొండచిలువ కలకలం రేపింది.
- పాశం రత్తయ్య ఇంట్లోకి సుమారు 20 అడుగుల పొడవున్న కొండచిలువ చొరబడింది.
- గురువారం తెల్లవారుజామున 4:55 గంటల సమయంలో దీనిని గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.
గండిపాలెం గ్రామంలోని బీసీ కాలనీలో భారీ కొండచిలువ కలకలం రేపింది. పాశం రత్తయ్య ఇంట్లోకి సుమారు 20 అడుగుల పొడవున్న కొండచిలువ చొరబడింది. గురువారం తెల్లవారుజామున 4:55 గంటల సమయంలో దీనిని గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని సురక్షితంగా తరలించారు. ఈ రెస్క్యూ కార్యక్రమంలో స్థానికుడు వెంగపల్లి కుమార్ రాజా అటవీ సిబ్బందికి సహకరించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.