వార్త ముఖ్యాంశాలు
- వింజమూరులో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
- ఈ సందర్భంగా పట్టణంలోని 19వ వార్డు జీబీకేఆర్ ఎస్టీ కాలనీ పోలింగ్ కేంద్రంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.
వింజమూరులో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పట్టణంలోని 19వ వార్డు జీబీకేఆర్ ఎస్టీ కాలనీ పోలింగ్ కేంద్రంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. వింజమూరు, కలిగిరి, కొండాపురం, జలదంకి మండలాల ఓటర్లు మధ్యాహ్నం ఒంటి గంటలోపు తమ ఓటు హక్కును వినియోగించుకుని గ్రామాల అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.