నెల్లూరు, నవంబర్ 24: రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) హరీశ్ కుమార్ గుప్తా మంగళవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు పోలీస్ కవాతు మైదానానికి చేరుకోనున్నారు.పర్యటనలో భాగంగా చిన్నబజారు పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మూలాపేట పోలీస్ క్వార్టర్స్‌లో చేపట్టనున్న నూతన నిర్మాణాలకు భూమిపూజ నిర్వహిస్తారు. అలాగే ఏఆర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ సేఫ్టీ కంట్రోల్ రూమ్, కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ప్రారంభించనున్నారు.డీజీపీ పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వెజెండ్ల ఆధ్వర్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు.
