Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో నేడు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పర్యటన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నెల్లూరులో నేడు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పర్యటన

నెల్లూరు, నవంబర్ 24: రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) హరీశ్ కుమార్ గుప్తా మంగళవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు పోలీస్ కవాతు మైదానానికి చేరుకోనున్నారు.పర్యటనలో భాగంగా చిన్నబజారు పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మూలాపేట పోలీస్ క్వార్టర్స్‌లో చేపట్టనున్న నూతన నిర్మాణాలకు భూమిపూజ నిర్వహిస్తారు. అలాగే ఏఆర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ సేఫ్టీ కంట్రోల్ రూమ్, కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ప్రారంభించనున్నారు.డీజీపీ పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వెజెండ్ల ఆధ్వర్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు.

నెల్లూరులో నేడు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పర్యటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *