వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు, నవంబర్: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు.సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
- ఈ నెల 26న జరగనున్న తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
- తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
నెల్లూరు, నవంబర్: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు.సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 26న జరగనున్న తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.అలాగే గ్రామాల్లో బూత్ లెవల్ అధికారులు ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పులు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు.ఈ సమావేశంలో శంకరన్ హాల్ నుంచి జిల్లా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అధికారి వసుమతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేశవర్ధన్ రెడ్డి, డీఈఓ ఆర్. బాలాజీరావు, డీటీసీ చందర్, ఆర్ఓ వరప్రసాద్, ఆర్టీసీ ఆర్ఎం షమీం తదితరులు పాల్గొన్నారు.