Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైస్ చైర్మన్ ఎన్నికపై జనసేన కౌన్సిలర్ల నిరసన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వైస్ చైర్మన్ ఎన్నికపై జనసేన కౌన్సిలర్ల నిరసన

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు:* మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఆత్మకూరులో తీవ్ర వివాదానికి దారితీసింది.
  • జనసేన పార్టీ అధిష్టానం వైస్ చైర్మన్ అభ్యర్థిగా 11వ వార్డు కౌన్సిలర్ కొలగాని శిరీష పేరును ఖరారు చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు.
  • అయితే మంత్రి ఆనం రామనారాయణరెడ్డి 6వ వార్డు కౌన్సిలర్ కత్తి పద్మజ పేరును ప్రతిపాదించడంతో ఆమె వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.దీంతో కొలగాని శిరీష, గడ్డం సంధ్య ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు.

ఆత్మకూరు:* మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఆత్మకూరులో తీవ్ర వివాదానికి దారితీసింది. జనసేన పార్టీ అధిష్టానం వైస్ చైర్మన్ అభ్యర్థిగా 11వ వార్డు కౌన్సిలర్ కొలగాని శిరీష పేరును ఖరారు చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు. అయితే మంత్రి ఆనం రామనారాయణరెడ్డి 6వ వార్డు కౌన్సిలర్ కత్తి పద్మజ పేరును ప్రతిపాదించడంతో ఆమె వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.దీంతో కొలగాని శిరీష, గడ్డం సంధ్య ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. పార్టీ నిర్ణయాన్ని పక్కనపెట్టి అభ్యర్థిని మార్చడం పొత్తు ధర్మానికి విరుద్ధమని ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని కార్యాలయం నుంచి బయటకు పంపించి, అనంతరం అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు జనసేన నేత నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వారిని కూడా పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ పరిణామాలతో ఆత్మకూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివాదం కారణంగా కొలగాని శిరీష కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *