వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు (సిటీ), నవంబర్ (పున్నమి): నెల్లూరు నగర మేయర్, డిప్యూటీ మేయర్ రఘునాథరాజుతో పాటు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులకు చేదు అనుభవం ఎదురైంది.
- మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో పాత్రికేయులకు కనీసం కూర్చునేందుకు కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.మీడియా కోసం కేటాయించిన క్యాబిన్‌ను కార్పొరేటర్ల అనుచరులు ఆక్రమించడంతో, వారిని ఖాళీ చేయించాలని మీడియా ప్రతినిధులు అధికారులను…
- దీంతో పాత్రికేయులు కార్యక్రమం ముగిసే వరకు నిలబడే పరిస్థితి ఏర్పడింది.ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తూ వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లే మీడియా ప్రతినిధుల పట్ల ఇలాంటి నిర్లక్ష్య వైఖరి తగదని పలువురు పాత్రికేయులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
నెల్లూరు (సిటీ), నవంబర్ (పున్నమి): నెల్లూరు నగర మేయర్, డిప్యూటీ మేయర్ రఘునాథరాజుతో పాటు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో పాత్రికేయులకు కనీసం కూర్చునేందుకు కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.మీడియా కోసం కేటాయించిన క్యాబిన్‌ను కార్పొరేటర్ల అనుచరులు ఆక్రమించడంతో, వారిని ఖాళీ చేయించాలని మీడియా ప్రతినిధులు అధికారులను కోరినా స్పందన లభించలేదని సమాచారం. దీంతో పాత్రికేయులు కార్యక్రమం ముగిసే వరకు నిలబడే పరిస్థితి ఏర్పడింది.ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తూ వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లే మీడియా ప్రతినిధుల పట్ల ఇలాంటి నిర్లక్ష్య వైఖరి తగదని పలువురు పాత్రికేయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లో మీడియాకు తగిన గౌరవం, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.