Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మద్దూరు పాడు ఒకటవ వార్డులో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మద్దూరు పాడు ఒకటవ వార్డులో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రచారం

కావలి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దూరుపాడు 1వ వార్డులో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి నాయకులతో కలిసి ఓటర్లను కలుసుకుని అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించగా స్థానికులు ఘనస్వాగతం పలికారు.

మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ కమలం గుర్తుపై, 1వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి మర్రి కళ్యాణి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. మద్దూరుపాడు అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని, రైల్వే అండర్ పాస్ వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పసుపులేటి వెంకటేశ్వర్లు, బోగోలు మండల నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మద్దూరు పాడు ఒకటవ వార్డులో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రచారం

మద్దూరు పాడు ఒకటవ వార్డులో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రచారం

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *