వార్త ముఖ్యాంశాలు
- విశాఖపట్నం జిల్లా, ఆనందపురం (పున్నమి ప్రతినిధి): నవంబర్ 21 :: శోంఠ్యం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) బలపరిచిన అభ్యర్థి లెంక రాంబాబు భారీ జనసందోహం నడుమ తన నామినేషన్ దాఖలు చేశారు.
- ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రజలు, మహిళలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో ఆయన వెంట తరలివచ్చారు.
- అందరూ కలిసికట్టుగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.
విశాఖపట్నం జిల్లా, ఆనందపురం (పున్నమి ప్రతినిధి): నవంబర్ 21 ::
శోంఠ్యం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) బలపరిచిన అభ్యర్థి లెంక రాంబాబు భారీ జనసందోహం నడుమ తన నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రజలు, మహిళలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో ఆయన వెంట తరలివచ్చారు. అందరూ కలిసికట్టుగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.
గ్రామ ప్రజల రాకతో నామినేషన్ కేంద్రం వద్ద సందడి నెలకొంది. మహిళలు, యువత, అభిమానులు, కార్యకర్తల ఉత్సాహం మధ్య లెంక రాంబాబు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది.
గ్రామ ప్రజల ఆశీస్సులు, అభిమానుల ఆత్మీయత, కార్యకర్తల సహకారంతో ఎన్నికల బరిలోకి దిగినట్లు ఈ సందర్భంగా ఆయన మద్దతుదారులు పేర్కొన్నారు.
శోంఠ్యం గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో లెంక రాంబాబు నామినేషన్‌తో గ్రామంలో ఎన్నికల సందడి మరింత పెరిగింది. రానున్న ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందన్న ఆసక్తి గ్రామంలో నెలకొంది.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్