వార్త ముఖ్యాంశాలు
- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 21 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించి నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు.
- విశ్వనాథ స్వామివారికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- మధ్యాహ్నం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 21 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించి నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. విశ్వనాథ స్వామివారికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చెర్లోపల్లి గ్రామానికి చెందిన నారాయణం వెంకటేశ్వర్లు, సునీత దంపతులు, వారి కుమారుడు సుధీర్, సుజాత దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్