వార్త ముఖ్యాంశాలు
- చాబోలు క్రాస్‌రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం మర్రిపాడు: మండలంలోని చాబోలు క్రాస్‌రోడ్డు వద్ద కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
- వరికుంటపాడు మండలం విరువూరు ఎస్సీ కాలనీకి చెందిన గుబిలి ఇజ్రాయిల్ (44) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
- బద్వేల్లో ఆటోకు సర్వీసింగ్ చేయించుకుని కుమారుడు సంతోష్‌తో కలిసి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ క్రమంలో విజయవాడ నుంచి ఒంటిమిట్ట వైపు వెళ్తున్న కారు చాబోలు క్రాస్‌రోడ్డు వద్ద ఆటోను బలంగా ఢీకొట్టింది.
చాబోలు క్రాస్‌రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
మర్రిపాడు: మండలంలోని చాబోలు క్రాస్‌రోడ్డు వద్ద కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వరికుంటపాడు మండలం విరువూరు ఎస్సీ కాలనీకి చెందిన గుబిలి ఇజ్రాయిల్ (44) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బద్వేల్లో ఆటోకు సర్వీసింగ్ చేయించుకుని కుమారుడు సంతోష్‌తో కలిసి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ క్రమంలో విజయవాడ నుంచి ఒంటిమిట్ట వైపు వెళ్తున్న కారు చాబోలు క్రాస్‌రోడ్డు వద్ద ఆటోను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఇజ్రాయిల్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన కుమారుడు సంతోష్ గాయపడ్డాడు. కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.